Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం చేస్తాం: టీజేఏ వ్యవస్థాపకులు ఉప్పల లక్ష్మణ్

Author
Posted By CK NEWS
| 18 Nov 2026, 06:09 PM | TELANGANA
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం చేస్తాం: టీజేఏ వ్యవస్థాపకులు ఉప్పల లక్ష్మణ్

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం చేస్తాం:
టీజేఏ వ్యవస్థాపకులు ఉప్పల లక్ష్మణ్.

టీ జే ఏ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారిగా కాసీం నియామకం..

రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా నాయకులు

ఇవి కూడా చదవండి

సిద్దిపేట జిల్లా, నవంబర్ 18:

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ జర్నలిస్టుల అసోసియేషన్ (TJA) నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని సంఘం వ్యవస్థాపకులు ఉప్పల లక్ష్మణ్ స్పష్టం చేశారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన భద్రత కోసం సంఘం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సిద్దిపేట జిల్లా నుంచి టీజేఏ జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు వంగ రాజు, జిల్లా అధ్యక్షులు సొల్లేటి ఆంజనేయులు, జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ భాషవేణి లింగమూర్తితో పాటు పలువురు జిల్లా నాయకులు హాజరయ్యారు.
రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల ఎన్నికలకు ఎన్నికల అధికారి నియామకం
ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో నూతన రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల అధికారిగా కాసీంను సమావేశంలో నియమించారు. ఎన్నికల ప్రక్రియను ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఆయనకు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకం రానున్న రాష్ట్ర కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియకు కీలక పరిణామంగా నిలిచింది.
ఈ సందర్భంగా ఉప్పల లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా టీజేఏను మరింత బలోపేతం చేయడానికి అన్ని జిల్లాల నాయకులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసి, అర్హులైన జర్నలిస్టులను సంఘంలో భాగస్వాములను చేయాలని సూచించారు. సంఘం బలోపేతానికి జిల్లా, మండల స్థాయి నాయకులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, బస్సు, రైల్వే పాసుల కోసం కృషి చేయాలని జిల్లా కమిటీలను ఆదేశించారు.
జర్నలిస్టులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని ఉప్పల లక్ష్మణ్ తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, ఆరోగ్య భద్రత కోసం హెల్త్ కార్డులు, ప్రయాణ సౌకర్యం కోసం బస్సు పాసులు, రైల్వే పాసులు తదితర సంక్షేమ సదుపాయాలు కల్పించాలనే అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం టీజేఏ రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
జర్నలిజం వృత్తిలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘం నాయకులు, సభ్యులు వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా నాయకులు జిల్లాలో టీజేఏ సభ్యత్వ నమోదు, సంఘం విస్తరణ, జర్నలిస్టుల సమస్యలపై చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
ఈ సమావేశంలో టీజేఏ రాష్ట్ర అధ్యక్షులు కె,వెంకటరమణ రావు, ప్రధాన కార్యదర్శి ఎం ఆర్,గోరి, ఎన్‌యూజే (ఐ) వైస్ ప్రెసిడెంట్ రాజ్‌నాథ్, రాష్ట్ర కార్యదర్శి రాజలింగం, వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన అక్రిడేషన్ కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి