Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

భూ రీ సర్వే వేగవంతం

Author
Posted By CK NEWS
| 23 Nov 2026, 07:23 PM | TELANGANA
భూ రీ సర్వే వేగవంతం

*భూ రీ సర్వే వేగవంతం*

*రోజుకు 80 ఎకరాల చొప్పున సర్వే.. నాలుగు బృందాలతో భూముల హద్దుల నిర్ధారణ*

సి కె న్యూస్ ప్రతినిది తిరుమలయపాలెం

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ ఆదేశాల మేరకు భూముల రీ సర్వే ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. తిరుమలాయపాలెం మండలం బీరోలు రెవెన్యూ పరిధిలో నాలుగు బృందాలుగా ఏర్పడిన జీపీవోలు, సర్వేయర్లు భూముల సర్వేను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. రోజుకు సుమారు 80 ఎకరాల చొప్పున సర్వే చేస్తూ భూముల హద్దులను నిర్ధారిస్తున్నారు.

బీరోలు రెవెన్యూ పరిధిలో కొనసాగుతున్న భూ రీ సర్వేను మండల తహశీల్దారు లూథర్ విల్సన్ సోమవారం పరిశీలించారు. పట్టాదారులైన రైతులతో పాటు సరిహద్దు భూములకు చెందిన రైతులను భాగస్వామ్యం చేస్తూ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతుల సమక్షంలో భూముల హద్దులను గుర్తిస్తూ రీ సర్వే ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు.

సర్వే బృందంలో ఆర్ఐ జాలి లక్ష్మణ్, జీపీవోలు గుడ్ల రమేష్, కనకం భూపతి, షేక్ నన్నేసాబ్, టి.కోటయ్య, వీరభద్రం, సర్వేయర్లు ఎస్.కే. సాధిక్, నరేష్, విజయ్ మండల రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొంటున్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి