Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి

Author
Posted By CK NEWS
| 23 Nov 2026, 03:29 PM | TELANGANA
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి

పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలి

జిల్లా డి ఆర్ ఓ కు టీజేఏ ఖమ్మం జిల్లా నాయకుల వినతి

ఇవి కూడా చదవండి

సి కె న్యూస్ ప్రతినిది ఖమ్మం,

అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని, పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులను వెంటనే మంజూరు చేసి అందజేయాలని కోరుతూ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (TJA) ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా టీజేఏ జిల్లా నాయకులు మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులు ఎన్నో ఆర్థిక, సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఏళ్ల తరబడి జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్న అర్హులైన జర్నలిస్టులకు సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
గతంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని అర్హులైన జర్నలిస్టులకు ఎలాంటి జాప్యం లేకుండా పంపిణీ చేయాలని కోరారు. అదేవిధంగా అర్హత కలిగిన జర్నలిస్టులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులను తక్షణమే జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సానుకూలంగా స్పందించి ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని టీజేఏ నాయకులు కోరారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి