Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ముత్తారపుకట్ట పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫాం పంపిణీ

Author
Posted By G KALYAN KUMAR
| 29 Oct 2026, 06:09 PM | TELANGANA
ముత్తారపుకట్ట పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫాం పంపిణీ

స్పోర్ట్స్ యూనిఫాం కొరకు రూ. 25,200 ఆర్థిక సహాయం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు

సికె న్యూస్ ప్రతినిధి ఇల్లందు.

ఈ రోజు ముత్తారపుకట్ట పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫాం కుట్టించి వారి తల్లిదండ్రులు అందజేశారు. పిల్లలకు ఈ విద్యా సంవత్సరం స్పోర్ట్స్ డ్రెస్ ఏర్పాటుకు పిల్లల తల్లిదండ్రులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 25,200 రూపాయలు విరాళం పాఠశాలకు అందించి స్పోర్ట్స్ యూనిఫాం పంపిణీకి సహకరించి పాఠశాల విద్యార్థులకు అందజేశారని
HM కబ్బాకుల రవి, SMC చైర్మన్ కుంజ కృష్ణవేణి, వార్డు మెంబరు మెస్సు వసంత కుమారి, పాఠశాల దాత కుంజ రాంబాబు అన్నారు.ఈ విధముగా స్వచ్ఛందంగా తల్లిదండ్రులు స్పందించి ఉపాధ్యాయులు కోరిన వెంటనే స్పోర్ట్స్ డ్రెస్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.
పిల్లల తల్లిదండ్రులను పాఠశాల ఉపాధ్యాయులు, SMC చైర్మన్, వార్డు మెంబర్ గ్రామస్తులు హృదయపూర్వకంగా అభినందించారు.
పాఠశాలకు భవిష్యత్తులో ఏ అవసరాలు ఉన్న తమవంతుగా ఆర్థిక సహాయం అందించి పాఠశాల అభివృద్ధికి, మౌలికవసతులను పెంపొందించుటకు ఉపాధ్యాయులకు సహకరిస్తామని తల్లిదండ్రులు హామీ ఇచ్చారు. అందుకు పాఠశాల ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అరెం రవి కుమార్, కిన్నెర ప్రత్యూష, ఇర్ప నందిని, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి