Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

పద్మశ్రీ దాసరి కొండప్పను సన్మానించిన తీన్మార్ మల్లన్న

Author
Posted By CK NEWS
| 30 Sep 2026, 10:23 AM | TELANGANA
పద్మశ్రీ దాసరి కొండప్పను సన్మానించిన తీన్మార్ మల్లన్న

ముఖ్యమైన పాయింట్స్:

  • పద్మశ్రీ దాసరి కొండప్పను సన్మానించిన తీన్మార్ మల్లన్న

పద్మశ్రీ దాసరి కొండప్పను సన్మానించిన తీన్మార్ మల్లన్న

బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా నారాయణపేట జిల్లా దామరగిద్దకు చేరుకున్న తీన్మార్ మల్లన్న గారు ప్రముఖ బుర్రవీణ విద్వాంసుడు పద్మశ్రీ దాసరి కొండప్ప గారిని కలిసి సన్మానించారు.

దామరగిద్ద మండలానికి చెందిన దాసరి కొండప్ప అంతరించిపోతున్న అరుదైన జానపద కళారూపమైన బుర్రవీణ కళను మూడో తరంగా పరిరక్షిస్తూ భావితరాలకు అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వెదురు, సొరకాయ పెంకులు, లోహపు తీగలతో తయారయ్యే స్వదేశీ తంత్రి వాయిద్యమైన బుర్రవీణను వాయిస్తూ, తెలుగు మరియు కన్నడ భాషల్లో సామాజిక, ఆధ్యాత్మిక, తాత్విక పదాలను ఆలపిస్తూ ఈ కళకు విశేష ప్రచారం కల్పించారు.

జానపద కళారంగానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2024 సంవత్సరంలో దాసరి కొండప్పను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి