పద్మశ్రీ దాసరి కొండప్పను సన్మానించిన తీన్మార్ మల్లన్న
ముఖ్యమైన పాయింట్స్:పద్మశ్రీ దాసరి కొండప్పను సన్మానించిన తీన్మార్ మల్లన్న పద్మశ్రీ దాసరి కొండప్పను సన్మానించిన తీన్మార్ మల్లన్న బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా నారాయణపేట జిల్లా దామరగిద్దకు చేరుకున్న తీన్మార్ మల్లన్న గారు ప్రముఖ బుర్రవీణ విద్వాంసుడు పద్మశ్రీ దాసరి కొండప్ప గారిని కలిసి సన్మానించారు. దామరగిద్ద మండలానికి చెందిన దాసరి కొండప్ప అంతరించిపోతున్న అరుదైన జానపద కళారూపమైన బుర్రవీణ కళను మూడో తరంగా పరిరక్షిస్తూ భావితరాలకు అందిస్తున్నారు. వెదురు, సొరకాయ పెంకులు, లోహపు తీగలతో తయారయ్యే స్వదేశీ తంత్రి వాయిద్యమైన బుర్రవీణను వాయిస్తూ, తెలుగు మరియు కన్నడ భాషల్లో సామాజిక, ఆధ్యాత్మిక, తాత్విక పదాలను ఆలపిస్తూ ఈ కళకు విశేష ప్రచారం కల్పించారు. జానపద...