భూ రీ సర్వే వేగవంతం

*భూ రీ సర్వే వేగవంతం* *రోజుకు 80 ఎకరాల చొప్పున సర్వే.. నాలుగు బృందాలతో భూముల హద్దుల నిర్ధారణ* సి కె న్యూస్ ప్రతినిది తిరుమలయపాలెం ప్రభుత్వ ఆదేశాల మేరకు భూముల రీ సర్వే ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. తిరుమలాయపాలెం మండలం బీరోలు రెవెన్యూ పరిధిలో నాలుగు బృందాలుగా ఏర్పడిన జీపీవోలు, సర్వేయర్లు భూముల సర్వేను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. రోజుకు సుమారు 80 ఎకరాల చొప్పున సర్వే చేస్తూ భూముల హద్దులను నిర్ధారిస్తున్నారు. బీరోలు రెవెన్యూ పరిధిలో కొనసాగుతున్న భూ రీ సర్వేను మండల తహశీల్దారు లూథర్ విల్సన్ సోమవారం పరిశీలించారు. పట్టాదారులైన రైతులతో పాటు సరిహద్దు భూములకు చెందిన రైతులను భాగస్వామ్యం చేస్తూ సర్వే...