Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

టాకురాజుగూడ గ్రామంలో అభయ ఆంజనేయ స్వామివారి రాతి గడప ప్రారంభోత్సవం

Author
Posted By CK NEWS
| 15 Nov 2026, 09:03 AM | TELANGANA
టాకురాజుగూడ గ్రామంలో అభయ ఆంజనేయ స్వామివారి రాతి గడప ప్రారంభోత్సవం

టాకురాజుగూడ గ్రామంలో అభయ ఆంజనేయ స్వామివారి రాతి గడప ప్రారంభోత్సవం

సి కె న్యూస్ ప్రతినిది

కడ్తాల్ మండలం, టాకురాజుగూడ:

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం టాకురాజుగూడ గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయ రాతి గడప ప్రారంభోత్సవం మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఇవి కూడా చదవండి

ఆలయ అభివృద్ధిలో భాగంగా గ్రామ ప్రజలు, భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమకు తోచిన విధంగా ఆర్థిక విరాళాలు అందించడం విశేషం. ఎవరిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా, తమ భక్తి, స్థోమతకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ విరాళాలు అందించి ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించారు.

ఈ సందర్భంగా భక్తుల సహకారంతో రాతి గడప ఏర్పాటు చేయడం గ్రామ ఐక్యతకు, ఆధ్యాత్మిక సేవాభావానికి నిదర్శనంగా నిలిచింది. ఆలయ అభివృద్ధి అనేది ఒక్కరి బాధ్యత కాదని, భక్తులందరి భాగస్వామ్యంతోనే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు విజయవంతమవుతాయని పలువురు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ టాస్క్‌ఫోర్స్ COO మరియు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ శ్రీ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి , కడ్తాల్ మాజీ జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్ , గంగుమర్ల తండా సర్పంచ్ సేవా నాయక్ హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో రేక్యా తండా ఉపసర్పంచ్ దేవేందర్, మాజీ సర్పంచ్ హరిచంద్, వార్డు సభ్యురాలు జ్యోతి, బంజారా సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేష్ నాయక్ ఇస్లావత్, తండా పెద్దలు రాంచందర్ నాయక్, ధర్మ నాయక్, రాములు నాయక్, జగన్ నాయక్, రమేష్ నాయక్, బలరాం నాయక్, భీమా నాయక్, కోటియ, కిషన్, ప్రేమ్, DK రాజు, లాలూ నాయక్, రఘువీర్, బాస్కర్, హన్మంతు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, భక్తులు అందించిన సహకారాన్ని అతిథులు అభినందించారు. భవిష్యత్తులో కూడా ఆలయ అభివృద్ధికి గ్రామ ప్రజలు, భక్తులు ఇదే ఐక్యతతో ముందుకు రావాలని ఆకాంక్షించారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి