Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

భారత్ ఫ్యూచర్ సిటీలో గిరిజన లంబాడీల సంస్కృతి పరిరక్షణకు 20 ఎకరాల భూమి కేటాయించాలి – కందుకూరు RDOకు బంజారా సేవాదళ్ వినతి

Author
Posted By CK NEWS
| 15 Nov 2026, 08:50 AM | TELANGANA
భారత్ ఫ్యూచర్ సిటీలో గిరిజన లంబాడీల సంస్కృతి పరిరక్షణకు 20 ఎకరాల భూమి కేటాయించాలి – కందుకూరు RDOకు బంజారా సేవాదళ్ వినతి

భారత్ ఫ్యూచర్ సిటీలో గిరిజన లంబాడీల సంస్కృతి పరిరక్షణకు 20 ఎకరాల భూమి కేటాయించాలి – కందుకూరు RDOకు బంజారా సేవాదళ్ వినతి

కందుకూరు RDO జగదీశ్వర్ రెడ్డి కి వినతిపత్రం అందజేత

రంగారెడ్డి జిల్లా: ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో గిరిజన లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను భావితరాలకు పరిచయం చేసే విధంగా గిరిజన లంబాడీ మ్యూజియం, సంత్ సేవాలాల్ మహారాజ్ భవ్య మందిరం, భారీ విగ్రహం మరియు సాంస్కృతిక కేంద్రం ఏర్పాటుకు 20 ఎకరాల భూమిని కేటాయించాలని కోరుతూ బంజారా సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కందుకూరు RDO శ్రీ జగదీశ్వర్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా బంజారా సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురాం రాథోడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో గిరిజన లంబాడీ సమాజం కీలక పాత్ర పోషిస్తోందని, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణ పరిధిలో లంబాడీ గిరిజన రైతుల భూములు కూడా ఉన్నాయని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గిరిజనుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు తగిన గుర్తింపు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ సురేష్ నాయక్ ఇస్లావత్ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలు, బంజారా జాతి చరిత్ర, జీవన విధానం, కళలు, సంప్రదాయాలు మరియు సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు ఒకే ప్రాంగణంలో గిరిజన లంబాడీ మ్యూజియం, సంత్ సేవాలాల్ మహారాజ్ భవ్య మందిరం, భారీ విగ్రహం మరియు సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో కనీసం 20 ఎకరాల భూమిని కేటాయించి బంజారా జాతి ఆత్మగౌరవానికి గుర్తింపు కల్పించాలని RDO కి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బంజారా సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రఘురాం రాథోడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ సురేష్ నాయక్ ఇస్లావత్, రాష్ట్ర కార్యదర్శి శ్రీ లక్ష్మణ్ నాయక్, రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ పాప్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

బంజారా జాతి సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం మరియు భావితరాల భవిష్యత్తు కోసం బంజారా సేవాదళ్ తన పోరాటాన్ని, కృషిని నిరంతరం కొనసాగిస్తుందని నాయకులు తెలిపారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి