Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభం

Author
Posted By CK NEWS
| 27 Oct 2026, 03:25 PM | TELANGANA
తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభం

ముఖ్యమైన పాయింట్స్:

  • సి కె న్యూస్ ప్రతినిది

ఖమ్మంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభం

ఖమ్మం: తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ ఆధ్వర్యంలో వరంగల్–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఖమ్మంలో ప్రారంభించారు.

ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మూడు జిల్లాల కోఆర్డినేటర్ సయ్యద్ ఇస్మాయిల్, ఖమ్మం పార్లమెంట్ ఇన్‌చార్జ్ అనిత చౌదరి ముఖ్య అతిథులుగా హాజరై ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తమ నాయకురాలు కల్వకుంట్ల కవిత గారి ఆదేశాల మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న విద్యావంతుడు, ఉద్యమకారుడు నలమాస శ్రీకాంత్ గౌడ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సామాజిక న్యాయం, తెలంగాణ రాష్ట్ర హక్కుల పరిరక్షణ, అణగారిన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం లక్ష్యంగా పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాలని నాయకులు సూచించారు. ఆదివాసీ, గిరిజన బిడ్డలతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, చదువుకున్న వారికి ఉద్యోగాలు, మెరుగైన జీవనోపాధి అవకాశాలు, అందరికీ నాణ్యమైన వైద్యం, రైతులకు మెరుగైన సహకారం, చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని అన్నారు. ముఖ్యంగా అణగారిన వర్గాల బిడ్డలకు న్యాయం జరగాలంటే సామాజిక న్యాయమే మార్గమని పేర్కొన్నారు. పట్టభద్రులు ఓటరు నమోదుపై అవగాహన పెంచుకుని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వీరభద్రం, వనం నాగేందర్, కర్లపూడి రఫీ, హరిఫ్, రాజ్ కుమార్, తాళ్లూరు సైదులు, సద్గుర్తి మురళీకృష్ణ, హుస్సేన్, ఉపేందర్, జ�

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి