Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

వనపర్తిలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు - నవంబర్ 6న సాంస్కృతిక పోటీలు

Author
Posted By News Desk
| 26 Oct 2026, 04:13 PM | వనపర్తి
వనపర్తిలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు - నవంబర్ 6న సాంస్కృతిక పోటీలు

ముఖ్యమైన పాయింట్స్:

  • 15 నుండి 29 ఏళ్ల యువతకు అవకాశం - My Bharat Portal లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి అన్న జిల్లా యువజన క్రీడల అధికారి

వనపర్తి, అక్టోబర్ 26: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని, 30వ జాతీయ యువజనోత్సవాలలో భాగంగా వనపర్తి జిల్లాలో జిల్లా స్థాయి వికసిత్ భారత్ యువ నాయకుల సంభాషణ (VBYLD)-2027 మరియు జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలు 2026-27 నిర్వహించనున్నట్లు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి (FAC) టి. సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఈ పోటీలు 2026 నవంబర్ 6వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి వనపర్తి మినీ స్టేడియంలో నిర్వహించనున్నారు. జిల్లాలోని 15 నుండి 29 సంవత్సరాల లోపు వయస్సు గల యువతీ యువకులు పాల్గొనవచ్చు.

5 విభాగాలలో పోటీలు ఉంటాయి - జానపద నృత్యం (గ్రూపు), జానపద గీతాలు (గ్రూపు), పెయింటింగ్, నుక్కడ్ నాటక్ (వీధి నాటకం), కవిత్వ రచన. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారికి రాష్ట్ర స్థాయి పోటీలలో, రాష్ట్ర స్థాయి విజేతలకు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

పోటీలలో పాల్గొనేవారు తప్పనిసరిగా My Bharat Portal https://mybharat.gov.in/vbyld-2027 నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గత మూడు సంవత్సరాలలో జాతీయ యువజనోత్సవాలలో పాల్గొన్నవారు అర్హులు కారు. ప్రతి అభ్యర్థి ఒక అంశంలో మాత్రమే పాల్గొనాలి. రిజిస్ట్రేషన్ ప్రింటవుట్, ఆధార్ కార్డు కాపీ, రెండు పాస్ పోర్ట్ ఫోటోలను పోటీ రోజు కౌంటర్ వద్ద ఇవ్వాలి.

అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వివరాలకు IDOC Room No. 201, వనపర్తి కార్యాలయం లేదా 9885851813, 9866292353 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి