Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

Author
Posted By Chand Pasha
| 25 Nov 2026, 01:41 PM | వనపర్తి
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ముఖ్యమైన పాయింట్స్:

  • మండల ప్రత్యేక అధికారి ఎం.డి. సిరాజుద్దీన్ అహ్మద్

మదనాపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థల్లో నవంబర్ 26న బాల్య వివాహాల నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మండల ప్రత్యేక అధికారి ఎం.డి. సిరాజుద్దీన్ అహ్మద్ సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాల్య వివాహాలు బాలల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. బాలికలకు 18 సంవత్సరాలు, బాలురకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు జరిపించాలని, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, మహిళా సంఘాల ప్రతినిధులు సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
బాల్య వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాలల హక్కులను కాపాడుతూ ప్రతి బాలికకు విద్యతో పాటు ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి