Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

వనపర్తిలో జాబ్ మేళా.. నిరుద్యోగ యువతకు శుభవార్త

Author
Posted By News Desk
| 26 Oct 2026, 03:36 PM | వనపర్తి
వనపర్తిలో జాబ్ మేళా.. నిరుద్యోగ యువతకు శుభవార్త

ముఖ్యమైన పాయింట్స్:

  • 28న లిటిల్ విల్లే పాఠశాలలో ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ

వనపర్తి జిల్లాలోని నిరుద్యోగ యువతకు జిల్లా ఉపాధి కల్పన శాఖ శుభవార్త తెలిపింది. వనపర్తి, హైదరాబాద్ మరియు మహబూబ్ నగర్ లోని కంపెనీలలో శిక్షణ మరియు ఉపాధి కల్పించుటకు జిల్లా ఉపాధికల్పనా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి శ్రీ.యస్.చరణ్ దీప్ తెలిపారు.

ఈ జాబ్ మేళా వనపర్తి పట్టణంలోని పెబ్బేర్ రోడ్, భగీరథ కాలనీలోని లిటిల్ విల్లే (ఏ ప్రీమియం స్కూల్) నందు ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు.

ఇట్టి జాబ్ మేళాలో పాల్గొను నిరుద్యోగులు 18 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండవలెనని, విద్యార్హత SSC/Inter/Any Degree కలిగి ఉండవలెనని తెలిపారు. జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన నిరుద్యోగులకు శిక్షణ అనంతరం వనపర్తి, హైదరాబాద్ మరియు మహబూబ్ నగర్ నందు వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశం కల్పించబడునని తెలిపారు. కావున ఇట్టి అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరారు.

ఇవి కూడా చదవండి

పాల్గొనే కంపెనీలు:
1. పేటీఎం కంపెనీ 2. అపోలో కంపెనీ 3. శ్రీ విజయ బయో ఫెర్టిలైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 4. పి.ఎం.కె.కె. వనపర్తి 5. క్విక్ హైర్ కన్సల్టెన్సీ
మరిన్ని వివరాలకు ఫోన్ నెం: 7799073053 ను సంప్రదించాలని సూచించారు.

- చంద్ పాషా
Correspondent
Wanaparthy District

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి