Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ఉద్యోగాల కోసమే కాదు.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి- తీన్మార్ మల్లన్న

Author
Posted By CK NEWS
| 26 Oct 2026, 02:21 PM | TELANGANA
ఉద్యోగాల కోసమే కాదు.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి-  తీన్మార్ మల్లన్న

ముఖ్యమైన పాయింట్స్:

  • ఉద్యోగాల కోసమే కాదు.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి- తీన్మార్ మల్లన్న
  • • ఉన్నత చదువులతో పాటు వ్యాపారవేత్తలుగా రాణించాలి
  • • రాజకీయాల్లోకి వచ్చి ప్రజల బతుకులు మార్చే నాయకులుగా ఎదగాలని పిలుపు
  • • బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా పాఠశాల సందర్శన
  • నాగర్‌కర్నూల్ జిల్లా, కల్వకుర్తి నియోజకవర్గం, అక్టోబర్ 26:

విద్యార్థులు ఉన్నత చదువులు చదివి కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా, సొంతంగా వ్యాపారాలు స్థాపించి పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆకాంక్షించారు.

బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని జూపల్లే గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తీన్మార్ మల్లన్న గారు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు మల్లన్నకు స్వాగతం పలికారు.

అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన మల్లన్న వారి చదువులు, భవిష్యత్తు లక్ష్యాలు, ఆశయాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

చదువుకున్న ప్రతి ఒక్కరూ ఉద్యోగం సంపాదించాలనే ఆలోచనకే పరిమితం కాకుండా పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఎదగాలని కోరారు. ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయి నుంచి ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని అన్నారు.

అదేవిధంగా విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని మల్లన్న అభిప్రాయపడ్డారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, సమాజంలో మార్పు తీసుకువచ్చే నాయకత్వ లక్షణాలను విద్యార్థి దశ నుంచే పెంపొందించుకోవాలని చెప్పారు.

చదువు అనేది కేవలం వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా సమాజ అభివృద్ధికి, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడాలని విద్యార్థులకు సూచించారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి