Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

వేములపల్లి పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం

Author
Posted By CK NEWS
| 24 Oct 2026, 10:40 AM | TELANGANA
వేములపల్లి పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం

ముఖ్యమైన పాయింట్స్:

  • వేములపల్లి పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం
  • పోలీసు అమరవీరుల త్యాగాలు, పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థులకు అవగాహన
  • Ck న్యూస్ /అక్టోబర్ 23/వేములపల్లి

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేములపల్లి పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పోలీస్ అమరవీరుల త్యాగాలు, ప్రజల రక్షణలో పోలీసులు నిర్వహించే విధుల గురించి ఎస్‌ఐ వి సురేష్ రెడ్డి వివరించారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్, స్టేషన్ రైటర్ గది, ఎస్‌హెచ్‌ఓ గది, పాపిలాన్ పరికరం, సీసీ కెమెరాల పనితీరుతో పాటు అల్లర్ల నియంత్రణకు ఉపయోగించే రక్షణ పరికరాలను విద్యార్థులకు పరిచయం చేశారు. పోలీస్ శాఖ విధులు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్రను వివరించి, పోలీసుల సేవలపై అవగాహన కల్పించారు.

విద్యార్థులు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి వివిధ విభాగాల పనితీరును తెలుసుకున్నారు. పోలీస్ అమరవీరుల సేవలను స్మరించుకుంటూ, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ కార్యక్రమం ద్వారా సందేశం ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి