Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల దీక్షకు తీన్మార్ మల్లన్న సంఘీభావం

Author
Posted By CK NEWS
| 16 Oct 2026, 12:50 PM | TELANGANA
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల దీక్షకు తీన్మార్ మల్లన్న సంఘీభావం

ముఖ్యమైన పాయింట్స్:

  • ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల దీక్షకు తీన్మార్ మల్లన్న సంఘీభావం
  • నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ ఎదుట దీక్ష చేస్తున్న ఉద్యోగులను కలిసిన తీన్మార్ మల్లన్న
  • ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్
  • ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగ భద్రత, వేతన సమస్యలపై ప్రభుత్వానికి డిమాండ్
  • మల్లన్నకు వినతిపత్రం సమర్పించిన ఉద్యోగులు
  • సి కె న్యూస్ ప్రతినిది నాగర్ కర్నూల్

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 16: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం దీక్ష చేపట్టిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను ఆయన కలుసుకుని వారి ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు.

జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా కలెక్టరేట్ ఎదుట దీక్ష చేస్తున్న ఉద్యోగుల వద్దకు వెళ్లిన తీన్మార్ మల్లన్న, వారి సమస్యలను, డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఉద్యోగ భద్రత లేకపోవడం, వేతన సమస్యలు, క్రమబద్ధీకరణ వంటి అంశాలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి వైద్య ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు.

ఎన్‌హెచ్‌ఎం పరిధిలోని 78 కేడర్లలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్న డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని,ఉద్యోగుల సర్వీసు, అర్హతలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

అలాగే ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు ప్రతి నెలా ఐదో తేదీలోపు వేతనాలు చెల్లించడం, పెండింగ్ వేతన బకాయిలను విడుదల చేయడం, వార్షిక ఇంక్రిమెంట్లు, లాయల్టీ బోనస్, ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య భద్రత కల్పించడం వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు.

మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు కల్పించడం, విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగి మరణించిన సందర్భంలో కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించడం వంటి డిమాండ్లపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాలను, ప్రభుత్వ ఉత్తర్వులను పరిశీలించి తెలంగాణలోనూ ఉద్యోగులకు న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.

వైద్య ఆరోగ్య వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సంబంధిత అధికారులు చర్చలు జరిపి, డిమాండ్ల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చొరవ చూపాలని, వారి డిమాండ్లపై కాలయాపన చేయకుండా నిర్ణయాలు తీసుకోవాలని తీన్మార్ మల్లన్న ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల తరపున తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి