Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి – ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు

Author
Posted By CK NEWS
| 03 Oct 2026, 01:00 PM | TELANGANA
విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి – ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు

ముఖ్యమైన పాయింట్స్:

  • విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి – ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు

వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సందర్శించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సైదులు తీన్మార్ మల్లన్న ని శాలువాతో సన్మానించారు.

అనంతరం కళాశాల విద్యార్థులతో సమావేశమైన తీన్మార్ మల్లన్న పలు అంశాలపై మాట్లాడారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల వైపే కాకుండా రాజకీయాల వైపు కూడా రావాలని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మన భవిష్యత్తును నిర్ణయించేది రాజకీయమే కాబట్టి విద్యార్థులు రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన “Political power is the master key” సిద్ధాంతాన్ని ఈ సందర్బంగా గుర్తుచేశారు.

ప్రస్తుత జరుగుతున్న Genz ఉద్యమాల్లో విద్యార్థులు భాగస్వాములు కావాలని, సమాజంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు.

యువత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రజా సమస్యలపై స్పందించాలని, ప్రభుత్వాల పనితీరును ప్రశ్నించాలని, ప్రజలకు ఇచ్చిన హామీలపై నిలదీయాలని పిలుపునిచ్చారు.విద్యార్థులతో కొన్ని కల్చరల్ ఆక్టివిటీస్ చేయించి వారిని ఉత్సాహ పరిచారు. అనంతరం విద్యార్థులందరికీ డిక్షనరీలు పంపిణీ చేశారు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి