విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి – ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు

ముఖ్యమైన పాయింట్స్:విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి – ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సైదులు తీన్మార్ మల్లన్న ని శాలువాతో సన్మానించారు. అనంతరం కళాశాల విద్యార్థులతో సమావేశమైన తీన్మార్ మల్లన్న పలు అంశాలపై మాట్లాడారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల వైపే కాకుండా రాజకీయాల వైపు కూడా రావాలని పిలుపునిచ్చారు. మన భవిష్యత్తును నిర్ణయించేది రాజకీయమే కాబట్టి విద్యార్థులు రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన “Political power is the master key” సిద్ధాంతాన్ని ఈ...