Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

Author
Posted By CK NEWS
| 26 Sep 2026, 05:47 PM | TELANGANA
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

సి కె న్యూస్ క్రీడా ప్రతినిది

హైదరాబాద్, సెప్టెంబర్ 26: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కార్యాలయంలో శనివారం ఘనంగా నివాళులు అర్పించారు.

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎ. సోనిబాలాదేవి, ఐఎఫ్‌ఎస్, ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా డాక్టర్ సోనిబాలాదేవి మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తి సమాజానికి ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ సాగించిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు.

చాకలి ఐలమ్మ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆమె పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమానత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ సోనిబాలాదేవి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ అధికారులు డాక్టర్ రవితేజ శ్రీనివాస్ అశోక్ కుమార్, కె ఆర్ పటాన్ అశ్విని దడ్పే,శాలిని పి ఆర్ ఓ సురేష్ కాలేరు కోచ్‌లు, సిబ్బంది తదితరులు పాల్గొని చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి