Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం:ఎమ్మెల్సీ తాతా మధు

Author
Posted By CK NEWS
| 26 Sep 2026, 05:12 PM | TELANGANA
వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం:ఎమ్మెల్సీ తాతా మధు

సి కె న్యూస్ ప్రతినిది ఖమ్మం: ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ మాట్లాడుతూ... నిజాం రాచరిక పాలన, గడీల పాలన, దొరల అరాచకత్వం కొనసాగుతున్న రోజుల్లో బలహీన వర్గాల కుటుంబంలో జన్మించినప్పటికీ వెనుకడుగు వేయకుండా విసునూరు దేశ్‌ముఖ్‌ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు.

దొరల ముందు సామాన్యులు తలెత్తి మాట్లాడలేని పరిస్థితుల్లో సింహంలా గర్జించి, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా, దొరల దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో స్ఫూర్తిదాయక ఘట్టమని అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తితోనే దొడ్డి కొమురయ్య ఆత్మార్పణతో తెలంగాణ సాయుధ పోరాటం మరింత ఉవ్వెత్తున ఎగిసిందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

సమైక్య పాలనలో చరిత్రలో మరుగునపడిన తెలంగాణ వీరుల త్యాగాలకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం కేసీఆర్ ప్రభుత్వానిదేనని తాతా మధుసూదన్ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించేలా గుర్తింపు కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేనని తెలిపారు.

“తెలంగాణ అంటే కేసీఆర్... కేసీఆర్ అంటే తెలంగాణ” అని పేర్కొన్న ఆయన, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్ల పాటు గులాబీ జెండా నాయకత్వంలో అలుపెరగని పోరాటం చేసి ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ గారిదేనన్నారు.

వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని, ఆమె ఆశయాలు, త్యాగాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ వారసత్వాన్ని అందిపుచ్చుకొని, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కేసీఆర్ నాయకత్వాన్ని తిరిగి బలోపేతం చేసే దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు, కనగాల వెంకటరావు, నాయకులు బొమ్మెర రామ్మూర్తి, బిచ్చాల తిరుమలరావు, బంక మల్లయ్య, పోగుల శీను, చిత్తారు సింహాద్రి, పగడాల నరేందర్, లింగనబోయిన సతీష్, బలుసు మురళీకృష్ణ, సద్దాం, యలమద్ది రవి, రఫీ, నరసింహారావు, దరిపెల్లి వీరబాబు, చీకటి రాంబాబు, రమేష్, బురహాన్, పోలెపాంగు వెంకట్ మరియు తదితరులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి