వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం:ఎమ్మెల్సీ తాతా మధు

సి కె న్యూస్ ప్రతినిది ఖమ్మం: ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ మాట్లాడుతూ... నిజాం రాచరిక పాలన, గడీల పాలన, దొరల అరాచకత్వం కొనసాగుతున్న రోజుల్లో బలహీన వర్గాల కుటుంబంలో జన్మించినప్పటికీ వెనుకడుగు వేయకుండా విసునూరు దేశ్‌ముఖ్‌ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. దొరల ముందు సామాన్యులు తలెత్తి మాట్లాడలేని పరిస్థితుల్లో సింహంలా గర్జించి, వెట్టిచాకిరీకి...