Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

అంగన్‌వాడీ గ్యాస్ కనెక్షన్లను కేంద్రాల పేర్లకు మార్చాలి

Author
Posted By CK NEWS
| 26 Sep 2026, 09:04 AM | TELANGANA
అంగన్‌వాడీ గ్యాస్ కనెక్షన్లను కేంద్రాల పేర్లకు మార్చాలి

ముఖ్యమైన పాయింట్స్:

  • అంగన్‌వాడీ గ్యాస్ కనెక్షన్లను కేంద్రాల పేర్లకు మార్చాలి
  • తొర్రూర్ ప్రాజెక్ట్ పరిధిలో సమస్యలు పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్‌కు వినతి

సీకే న్యూస్ ప్రతినిధి, సెప్టెంబర్ 25 : - తొర్రూర్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించిన గ్యాస్ కనెక్షన్లను ఆయా అంగన్‌వాడీ కేంద్రాల పేర్లకు అధికారికంగా మార్చాలని అంగన్‌వాడీ టీచర్స్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ప్రస్తుతం పలు అంగన్‌వాడీ కేంద్రాల గ్యాస్ కనెక్షన్లు సంబంధిత టీచర్ల వ్యక్తిగత పేర్లపై ఉండటంతో నిధుల నిర్వహణతో పాటు ఇతర అధికారిక ప్రక్రియల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని గ్యాస్ కనెక్షన్లను సంబంధిత అంగన్‌వాడీ కేంద్రాల పేర్లపైకి మార్చి, అధికారికంగా నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

అదేవిధంగా తొర్రూర్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు గ్యాస్ పంపిణీలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రస్తుతం వేర్వేరు గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ఉన్న కనెక్షన్లను ఒకే గ్యాస్ ఏజెన్సీ పరిధిలోకి తీసుకువచ్చి, గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించి, అంగన్‌వాడీ కేంద్రాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

వినతిపత్రం సమర్పించిన వారిలో అంగన్‌వాడీ టీచర్స్ జిల్లా కార్యదర్శి గుండు సులోచన, జిల్లా కోశాధికారి తిరుపతమ్మ, ప్రాజెక్టు కోశాధికారి మద్ది విజయ, జిల్లా సోషల్ మీడియా ప్రతినిధి శ్రీలక్ష్మి తదితరులు ఉన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి