అంగన్‌వాడీ గ్యాస్ కనెక్షన్లను కేంద్రాల పేర్లకు మార్చాలి

ముఖ్యమైన పాయింట్స్:అంగన్‌వాడీ గ్యాస్ కనెక్షన్లను కేంద్రాల పేర్లకు మార్చాలితొర్రూర్ ప్రాజెక్ట్ పరిధిలో సమస్యలు పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్‌కు వినతి సీకే న్యూస్ ప్రతినిధి, సెప్టెంబర్ 25 : - తొర్రూర్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించిన గ్యాస్ కనెక్షన్లను ఆయా అంగన్‌వాడీ కేంద్రాల పేర్లకు అధికారికంగా మార్చాలని అంగన్‌వాడీ టీచర్స్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం పలు అంగన్‌వాడీ కేంద్రాల గ్యాస్ కనెక్షన్లు సంబంధిత టీచర్ల వ్యక్తిగత పేర్లపై ఉండటంతో నిధుల నిర్వహణతో పాటు ఇతర అధికారిక ప్రక్రియల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని గ్యాస్ కనెక్షన్లను సంబంధిత అంగన్‌వాడీ...