Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ఇందిరమ్మ కుటుంబ 5.లక్షల జీవిత బీమా పథకంపై ప్రజలకు అవగాహన కల్పించిన అదనపు కలెక్టర్

Author
Posted By G KALYAN KUMAR
| 20 Nov 2026, 12:31 PM | TELANGANA
ఇందిరమ్మ కుటుంబ 5.లక్షల జీవిత బీమా పథకంపై ప్రజలకు అవగాహన కల్పించిన అదనపు కలెక్టర్

నవంబర్ 20.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుపల్లి మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ₹5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించడం జరజరుగుతుంద ఈ పథకంపై టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్,ఎంపీడీఓ శ్రీదేవి,ఎమ్మార్వో వీరభద్రం,ప్రజలకు పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు,ప్రయోజనాలను వివరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ జీవిత బీమా పథకానికి సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని ప్రజలు చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే పూర్తి బీమా ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుందని స్పష్టం చేశారు.
దీని గడువు నెల రోజుల వరకు ఉంటుందని స్పష్టం చేసారు.పేద,మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించి,కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా అండగా నిలవడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని వివరించారు.ప్రభుత్వమే బీమా ప్రీమియం భారం భరిస్తూ ప్రజల కుటుంబాలకు ₹5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడం అభినందనీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో కోయగూడెం ఉపసర్పంచ్ అనుష,ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం ఉమా సురేందర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి