Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ఇందిరమ్మ బీమా పథకం అమలుకు తాజా మార్గదర్శకాలు

Author
Posted By Chand Pasha
| 19 Nov 2026, 10:13 AM | వనపర్తి
ఇందిరమ్మ బీమా పథకం అమలుకు తాజా మార్గదర్శకాలు

ముఖ్యమైన పాయింట్స్:

  • నవంబర్ 20 నుంచి దశలవారీగా ఆన్‌లైన్ నమోదు ప్రారంభం

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (IKJBP) అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, రవి కిరణ్ రాష్ట్రంలోని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు సూచనలు చేశారు.
సూచనల ప్రకారం నవంబర్ 19న ఎలాంటి క్యాంపులు నిర్వహించకూడదని, నవంబర్ 20 నుంచి దశలవారీగా నమోదు ప్రక్రియ ప్రారంభించాలని తెలిపారు. తొలుత మెరుగైన ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఒకటి, రెండు గ్రామ పంచాయతీలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తుల నమోదు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే చేపట్టాలని, ముందుగా ముద్రించిన దరఖాస్తు ఫారాలు, సంతకాలు, డాక్యుమెంట్ల స్కానింగ్ అవసరం లేదని స్పష్టం చేశారు. దరఖాస్తుదారుల వివరాలను సేకరించి వెబ్ లేదా మొబైల్ అప్లికేషన్‌లో నమోదు చేయాలని తెలిపారు.
ఈ పథకానికి ఫుడ్ సెక్యూరిటీ కార్డు (రేషన్ కార్డు) తప్పనిసరి అని, కార్డు లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే బీమా పొందే వ్యక్తి, నామినీల వివరాలు, వాటా శాతంతో ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని ఆదేశించారు.
అవసరమైన చోట మీ సేవా కేంద్రాల సేవలను వినియోగించుకోవచ్చని, త్వరలో వెబ్, మొబైల్ అప్లికేషన్లు అందుబాటులోకి రానున్నాయని అధికారులు వెల్లడించారు. పథకం అమలులో తొందరపాటు లేకుండా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దశలవారీగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి