ఇందిరమ్మ బీమా పథకం అమలుకు తాజా మార్గదర్శకాలు
ముఖ్యమైన పాయింట్స్:నవంబర్ 20 నుంచి దశలవారీగా ఆన్లైన్ నమోదు ప్రారంభం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (IKJBP) అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, రవి కిరణ్ రాష్ట్రంలోని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పలు సూచనలు చేశారు. సూచనల ప్రకారం నవంబర్ 19న ఎలాంటి క్యాంపులు నిర్వహించకూడదని, నవంబర్ 20 నుంచి దశలవారీగా నమోదు ప్రక్రియ ప్రారంభించాలని తెలిపారు. తొలుత మెరుగైన ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఒకటి, రెండు గ్రామ పంచాయతీలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల నమోదు పూర్తిగా ఆన్లైన్లోనే చేపట్టాలని, ముందుగా ముద్రించిన దరఖాస్తు ఫారాలు,...