Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ఘనంగా ప్రారంభమైన పీఎంశ్రీ జోనల్ క్రీడా పోటీలు

Author
Posted By P. Shekar
| 18 Nov 2026, 04:21 PM | వార్తలు
ఘనంగా ప్రారంభమైన పీఎంశ్రీ జోనల్ క్రీడా పోటీలు

జిన్నారం,నవంబర్ 18(సీ కే న్యూస్ ప్రతినిధి):


జిన్నారం జోనల్ స్థాయి పీఎంశ్రీ పాఠశాలల క్రీడా పోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి విజయ్ కుమార్ క్రీడా పోటీలను ప్రారంభించారు.
జిన్నారం జోన్ పరిధిలోని ఆరు మండలాలకు చెందిన 11 పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. తొలుత క్రీడాకారులతో ఘనంగా మార్చ్‌పాస్ట్ నిర్వహించగా, అనంతరం ఎంఈఓ విజయ్ కుమార్ అధ్యక్షతన క్రీడా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జ్యోతి ప్రజ్వలనతో క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టారు.
ఈ పోటీల్లో భాగంగా అండర్‌-14, అండర్‌-17 విభాగాల్లో బాలబాలికలకు వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ, అథ్లెటిక్స్ తదితర క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.
ఈ సందర్భంగా ఎంఈఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైనా ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొంటూ క్రమశిక్షణ, పట్టుదల, క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ సభ్యులు, వివిధ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, పీడీలు, క్రీడాకారులు, రెఫరీలు, కోచ్‌లు, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రారంభమైన పీఎంశ్రీ జోనల్ క్రీడా పోటీలు - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి