ఘనంగా ప్రారంభమైన పీఎంశ్రీ జోనల్ క్రీడా పోటీలు
జిన్నారం,నవంబర్ 18(సీ కే న్యూస్ ప్రతినిధి): జిన్నారం జోనల్ స్థాయి పీఎంశ్రీ పాఠశాలల క్రీడా పోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి విజయ్ కుమార్ క్రీడా పోటీలను ప్రారంభించారు. జిన్నారం జోన్ పరిధిలోని ఆరు మండలాలకు చెందిన 11 పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. తొలుత క్రీడాకారులతో ఘనంగా మార్చ్‌పాస్ట్ నిర్వహించగా, అనంతరం ఎంఈఓ విజయ్ కుమార్ అధ్యక్షతన క్రీడా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జ్యోతి ప్రజ్వలనతో క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టారు. ఈ పోటీల్లో భాగంగా అండర్-14, అండర్-17 విభాగాల్లో బాలబాలికలకు వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ, అథ్లెటిక్స్ తదితర క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు....