Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ప్రతి కుటుంబానికి జీవిత భద్రత కల్పించడమే ఇందిరమ్మ బీమా లక్ష్యం

Author
Posted By Chand Pasha
| 18 Nov 2026, 09:04 AM | వనపర్తి
ప్రతి కుటుంబానికి జీవిత భద్రత కల్పించడమే ఇందిరమ్మ బీమా లక్ష్యం

ముఖ్యమైన పాయింట్స్:

  • అర్హులైన ప్రతి ఒక్కరూ పథకంలో నమోదు చేసుకోవాలి – మండల ప్రత్యేక అధికారి ఎం.డి. సిరాజుద్దీన్ అహ్మద్

సీకే న్యూస్ ప్రతినిధి – వనపర్తి జిల్లా:
కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మదనాపూర్ మండల ప్రత్యేక అధికారి ఎం.డి. సిరాజుద్దీన్ అహ్మద్ సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబానికి జీవనాధారంగా ఉన్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన వారికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడం ద్వారా కుటుంబాలకు భరోసా లభిస్తుందని తెలిపారు.
18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులు ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చని, నమోదు సమయంలో ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, కుటుంబ సభ్యులు, నామినీ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యే నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత సిబ్బంది ప్రజలకు పథకంపై అవగాహన కల్పించి అర్హులందరూ నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. ఆపద సమయంలో కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకాన్ని ప్రతి అర్హ కుటుంబం వినియోగించుకోవాలని ఎం.డి. సిరాజుద్దీన్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి