ప్రతి కుటుంబానికి జీవిత భద్రత కల్పించడమే ఇందిరమ్మ బీమా లక్ష్యం
ముఖ్యమైన పాయింట్స్:అర్హులైన ప్రతి ఒక్కరూ పథకంలో నమోదు చేసుకోవాలి – మండల ప్రత్యేక అధికారి ఎం.డి. సిరాజుద్దీన్ అహ్మద్ సీకే న్యూస్ ప్రతినిధి – వనపర్తి జిల్లా: కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మదనాపూర్ మండల ప్రత్యేక అధికారి ఎం.డి. సిరాజుద్దీన్ అహ్మద్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబానికి జీవనాధారంగా ఉన్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన వారికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడం ద్వారా...