Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు

Author
Posted By Chand Pasha
| 18 Nov 2026, 06:19 AM | వనపర్తి
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు

ముఖ్యమైన పాయింట్స్:

  • ఈ నెల 19 నుంచి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు.. అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా అందేలా చర్యలు

అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
సీకే న్యూస్ ప్రతినిధి – వనపర్తి జిల్లా:
వనపర్తి జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఈ నెల 19వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్‌తో కలిసి సంబంధిత అధికారులతో వెబ్ ఎక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పథకంపై గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రేషన్ కార్డుల ఆధారంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి దరఖాస్తులు పూర్తి చేయించాలని తెలిపారు.
గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేక శిబిరం, పట్టణాల్లో ప్రతి వార్డుకు ఒక శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శిబిరాల్లో కంప్యూటర్లు, టెంట్లు, టేబుళ్లు, కుర్చీలు, ఇతర అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ
కుటుంబాన్ని పోషించే యజమాని పేరిట బీమా దరఖాస్తు చేసుకోవాలని, 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఈ పథకానికి అర్హులని కలెక్టర్ తెలిపారు. కుటుంబ సంపాదనపరుడు అనుకోకుండా మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ అందిస్తుందని పేర్కొన్నారు.
దరఖాస్తుదారులు ఆధార్ కార్డు వివరాలతో పాటు నామినీల వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. రేషన్ కార్డులు లేని వారు ఆధార్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి రోజు కనీసం 50 కుటుంబాల వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
దరఖాస్తుల ఆన్‌లైన్ నమోదు, పత్రాల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించరాదని, శిబిరాల రోజువారీ పురోగతిని పర్యవేక్షించి నివేదికలు సమర్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డీఆర్ఓ రామ్ రెడ్డి, డీఆర్డీఓ ఉమాదేవి, సీపీఓ హరికృష్ణ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి