Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

సిపిఐ( ఎం-ఎల్)న్యూ డెమోక్రసీ పెద్ద చంద్రన్న పార్టీకి. మూకుమ్మడి రాజీనామాలు సిపిఐ(ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ అశోక్ పార్టీలో చేరికలు

Author
Posted By G KALYAN KUMAR
| 14 Nov 2026, 06:33 PM | TELANGANA
సిపిఐ( ఎం-ఎల్)న్యూ డెమోక్రసీ పెద్ద చంద్రన్న పార్టీకి. మూకుమ్మడి రాజీనామాలు సిపిఐ(ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ అశోక్ పార్టీలో చేరికలు

నవంబర్ 14.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పెద్ద చంద్రన్న పార్టీ అనుసరిస్తున్న విధానాలు నచ్చక, ప్రతిఘటనా పోరాటం పేరుతో కార్యకర్తలను,ప్రజలను మోసగించటం,ప్రజా సమస్యలపై దృష్టి సారించకపోవటం,పార్టీకి చెద పురుగులా తయారైన కందగట్ల సురేందర్ వ్యక్తిగత పోకడలకు పాల్పడటాన్ని చూసీ విసుగుచెందిన మేము పార్టీకి ముకుమ్మడిగా రాజీనామాలు చేసి సిపిఐ (ఎం-ఎల్ )న్యూ డెమోక్రసీ అశోక్ పార్టీలో చేరుతున్నట్లు గా ఉప్పర బోయిన రామ్మూర్తి మల్లూరి సుగుణ,చప్పిడి వెంకటేశ్వర్లు, అయోధ్య తదితరులు తెలిపారు.సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ అశోక్ పార్టీ చేస్తున్న ప్రజా సమస్యలపై నిత్యం ప్రజా పోరాటాలు ప్రజా ఉద్యమాలు చేపట్టటం గోదావరిలోయ ప్రతిఘటన పోరాట రాజకీయాల అమలు కోసం కృషి చేయడం చూసి ఆ పార్టీలో చేరుతున్నట్లుగా వారు తెలిపారు ఇకనుంచి సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ అశోక్ పార్టీలో కొనసాగుతామని వాళ్లు స్పష్టం చేశారు.చంద్రన్న పార్టీలో చెదపురుగులా తయారైన కొంతమందిని బహిష్కరించాలి అని అన్నారు.భద్రాది కొత్తగూడెం,ఖమ్మం జిల్లాలో నియంతలా వ్యవహరించటం,విప్లవ పార్టీ లక్షణాలు ఏమాత్రం సురేందర్ లో లేవని వాళ్ళు తెలిపారు. నిజాయితీగా పనిచేస్తూ పార్టీలో క్రమశిక్షణగా పనిచేస్తున్న మమ్మల్ని దూరం చేసే ఆలోచన సురేందర్ చేయటం సరైనది కాదని స్పష్టం చేస్తున్నాం. ఇప్పటికైనా పెద్ద చంద్రన్న నిజాయితీగా పనిచేసే కార్యకర్తలను నిలబెట్టుకోవాలని, పార్టీ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడే వ్యక్తులను పార్టీకి మచ్చ తెచ్చే వాళ్లను బహిష్కరించాలని వాళ్లు గుర్తు చేశారు.ఈ సందర్భంగా సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అశోక్, జిల్లా కార్యదర్శి బానోతు ఊక్లాలు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం,ప్రజల విముక్తి కోసం వందలాది మంది అమరులయ్యారు. ఆ అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దామని,ప్రతిఘటనా పోరాటాలను ఎత్తి పడదామని స్వదేశీ,విదేశీ,కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా బలమైన ప్రజా పోరాటాలు ప్రజా ఉద్యమాలు నిర్మిద్దామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు.సర్ప కృష్ణ, భూక్య శివ,పడిగా మంగన్న, తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ భానోత్ ఊఖ్లా స్పష్టం చేశారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి