సిపిఐ( ఎం-ఎల్)న్యూ డెమోక్రసీ పెద్ద చంద్రన్న పార్టీకి. మూకుమ్మడి రాజీనామాలు సిపిఐ(ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ అశోక్ పార్టీలో చేరికలు
నవంబర్ 14.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పెద్ద చంద్రన్న పార్టీ అనుసరిస్తున్న విధానాలు నచ్చక, ప్రతిఘటనా పోరాటం పేరుతో కార్యకర్తలను,ప్రజలను మోసగించటం,ప్రజా సమస్యలపై దృష్టి సారించకపోవటం,పార్టీకి చెద పురుగులా తయారైన కందగట్ల సురేందర్ వ్యక్తిగత పోకడలకు పాల్పడటాన్ని చూసీ విసుగుచెందిన మేము పార్టీకి ముకుమ్మడిగా రాజీనామాలు చేసి సిపిఐ (ఎం-ఎల్ )న్యూ డెమోక్రసీ అశోక్ పార్టీలో చేరుతున్నట్లు గా ఉప్పర బోయిన రామ్మూర్తి మల్లూరి సుగుణ,చప్పిడి వెంకటేశ్వర్లు, అయోధ్య తదితరులు తెలిపారు.సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ అశోక్ పార్టీ చేస్తున్న ప్రజా సమస్యలపై నిత్యం ప్రజా పోరాటాలు ప్రజా ఉద్యమాలు చేపట్టటం గోదావరిలోయ ప్రతిఘటన పోరాట రాజకీయాల అమలు...