Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలి

Author
Posted By News Desk
| 10 Nov 2026, 09:26 PM | వనపర్తి
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలి

ముఖ్యమైన పాయింట్స్:

  • అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు – అదనపు కలెక్టర్ హెచ్చరిక

సీకే న్యూస్ ప్రతినిధి, వనపర్తి జిల్లా:
ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అందుబాటులో ఉంచేందుకు జిల్లాలో ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా పెబ్బేరు మండలంలోని సాయి గణేష్ రైస్ మిల్, వనపర్తి మండలం నాగవరం గ్రామంలోని శ్రీ రాఘవేంద్ర ఇండస్ట్రీస్ వద్ద ఏర్పాటు చేసిన రెండు బియ్యం విక్రయ కేంద్రాలను అదనపు కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బియ్యం వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని, నిర్ణీత ధరల కంటే అధికంగా వసూలు చేయరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అధిక ధరలకు విక్రయాలు జరిపితే సంబంధిత వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విక్రయ కేంద్రాల్లో నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని, సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలు ఈ విక్రయ కేంద్రాలను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం కొనుగోలు చేయాలని సూచించారు.
బియ్యం రకాలు – ధరలు
BPT / KNM – కిలో ₹66
RNR / తెలంగాణ సోనా – కిలో ₹74
HMT / JSR – కిలో ₹79
ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యంగా ఈ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి