Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ఇష్టారాజ్యంగా టపాసుల దుకాణాలు !

Author
Posted By P. Shekar
| 07 Nov 2026, 07:48 PM | వార్తలు
ఇష్టారాజ్యంగా టపాసుల దుకాణాలు !

పటాన్‌చెరు, నవంబర్ 07(సీ కే న్యూస్ ప్రతినిధి):

దీపావళి పండుగను పురస్కరించుకుని పటాన్‌చెరు నియోజకవర్గ వ్యాప్తంగా టపాసుల దుకాణాలు ఇష్టారాజ్యంగా వెలుస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా, భద్రతా ప్రమాణాలను పక్కనపెట్టి పలుచోట్ల బాణసంచా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇష్టారాజ్యంగా టపాసుల దుకాణాలు ! - Additional Image

టపాసుల దుకాణాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అవి అమలవుతున్నాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

మరోవైపు, నిబంధనలు సక్రమంగా పాటించని దుకాణాలకు సైతం పటాన్‌చెరు అగ్నిమాపక శాఖ అధికారులు ఫైర్ సేఫ్టీ అనుమతులు ఎలా జారీ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ విషయంపై ఫోన్ ద్వారా ఫైర్ సేఫ్టీ ఎస్ఐని వివరణ కోరేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందించకపోవడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది.

దీపావళి సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా భారీ ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

టపాసుల దుకాణాల్లో భద్రతా ఏర్పాట్లు, అగ్నిమాపక పరికరాలు, అనుమతులు, నిబంధనల అమలుపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదు.. ప్రమాదం జరగకముందే నివారణ చర్యలు చేపట్టాలి. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన దుకాణాలపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అనుమతుల జారీ ప్రక్రియలో ఏమైనా అక్రమాలు జరిగాయా అన్న అంశాన్ని ఉన్నతాధికారులు పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని జిల్లా అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి