ఇష్టారాజ్యంగా టపాసుల దుకాణాలు !
పటాన్చెరు, నవంబర్ 07(సీ కే న్యూస్ ప్రతినిధి): దీపావళి పండుగను పురస్కరించుకుని పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా టపాసుల దుకాణాలు ఇష్టారాజ్యంగా వెలుస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా, భద్రతా ప్రమాణాలను పక్కనపెట్టి పలుచోట్ల బాణసంచా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టపాసుల దుకాణాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అవి అమలవుతున్నాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు తనిఖీలు...