Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

విద్యుత్ నగర్ కాలనీలో నీటి పొదుపుపై అవగాహన కార్యక్రమం

Author
Posted By P. Shekar
| 05 Nov 2026, 04:04 PM | వార్తలు
విద్యుత్ నగర్ కాలనీలో నీటి పొదుపుపై అవగాహన కార్యక్రమం

పటాన్చెరు, నవంబర్ 05(సీ కే న్యూస్ ప్రతినిధి):

అమీన్ పూర్ డివిజన్ పరిధిలోని
విద్యుత్ నగర్ కాలనీలో భూగర్భ జలాల పరిరక్షణ, బోర్‌వెల్ నీటి వృథాను అరికట్టే లక్ష్యంతో కాలనీవాసులు అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి కాలనీలోని ప్రతి ఇంటికి నడుచుకుంటూ వెళ్లి, నీటిని పొదుపుగా వినియోగించాలని ఇంటి యజమానులకు విజ్ఞప్తి చేశారు.
కాలనీలోని 200 గజాల స్థలాల్లో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండు పై అంతస్తులకు మాత్రమే అనుమతులు తీసుకుని, నిబంధనలకు విరుద్ధంగా అదనంగా మరో రెండు, మూడు అంతస్తులు నిర్మిస్తున్నట్లు కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒకే బోర్‌వెల్‌పై ఎక్కువ మంది అద్దెదారులు ఆధారపడటం వల్ల భూగర్భ జలాల వినియోగం పెరుగుతోందని పేర్కొన్నారు.
అంతేకాకుండా, కొందరు ఇళ్ల ముందు వరండాల్లో, రోడ్లపై వాహనాలను కడగడానికి బోర్‌వెల్ నీటిని వృథా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో భూగర్భ జలాల మట్టం తగ్గిపోయి కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు స్పందించి, భవన నిర్మాణ అనుమతులకు విరుద్ధంగా చేపడుతున్న అదనపు అంతస్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బోర్‌వెల్ నీటిని వృథా చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించి, నీటి వినియోగంపై నియంత్రణ ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందేశం ప్రతి ఇంటి యజమానికి చేరే వరకు ప్రతిరోజూ ఉదయం గంటపాటు అవగాహన కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. నీటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, నీటిని పొదుపు చేయకపోతే రేపటి తరాలకు నీటి సమస్యను వారసత్వంగా అందించినట్లవుతుందని కాలనీవాసులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అరుణ, వినయ్ కుమార్, ప్రవీణ్, శశి, త్రివేన్ తదితర కాలనీవాసులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి