విద్యుత్ నగర్ కాలనీలో నీటి పొదుపుపై అవగాహన కార్యక్రమం
పటాన్చెరు, నవంబర్ 05(సీ కే న్యూస్ ప్రతినిధి): అమీన్ పూర్ డివిజన్ పరిధిలోని విద్యుత్ నగర్ కాలనీలో భూగర్భ జలాల పరిరక్షణ, బోర్వెల్ నీటి వృథాను అరికట్టే లక్ష్యంతో కాలనీవాసులు అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి కాలనీలోని ప్రతి ఇంటికి నడుచుకుంటూ వెళ్లి, నీటిని పొదుపుగా వినియోగించాలని ఇంటి యజమానులకు విజ్ఞప్తి చేశారు. కాలనీలోని 200 గజాల స్థలాల్లో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండు పై అంతస్తులకు మాత్రమే అనుమతులు తీసుకుని, నిబంధనలకు విరుద్ధంగా అదనంగా మరో రెండు, మూడు అంతస్తులు నిర్మిస్తున్నట్లు కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒకే బోర్‌వెల్‌పై ఎక్కువ మంది అద్దెదారులు ఆధారపడటం...