Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

బెస్తగూడెంలో గుడుంబా స్థావరాలపైకార్డన్ అండ్ సెర్చ్ సక్సెస్

Author
Posted By Bhargav raju manne
| 05 Nov 2026, 10:22 AM | Crime
బెస్తగూడెంలో గుడుంబా స్థావరాలపైకార్డన్ అండ్ సెర్చ్ సక్సెస్

ముఖ్యమైన పాయింట్స్:

  • "గుడుంబా నివారణకు పోలీస్ శాఖ శ్రీకారం."
  • "బెస్తగూడెం గ్రామంలో గుడుంబా ఉత్పత్తి స్థావరాలపై పోలీస్ శాఖ తనిఖీలు."
  • "30 లీటర్ల గుడుంబా స్వాధీనం 500 లీటర్ల జాగరీ వాష్ ధ్వంసం."

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బెస్తగూడెం గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ తనిఖీలు నిర్వహించడం జరిగింది..
ఈ తనిఖీల్లో భాగంగా అక్రమంగా తయారు చేస్తున్న 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోవడంతో పాటు, గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 500 లీటర్ల జాగరీ వాష్‌ను ధ్వంసం చేశాము. గుడుంబా తయారీకి పాల్పడిన ముగ్గురు నిందితులపై కేసులు నమోదు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, అక్రమంగా గుడుంబా తయారు చేసినా, విక్రయించినా లేదా.! సరఫరా చేసినా ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది...అదేవిధంగా, సరైన ధ్రువపత్రాలు లేని 15 మోటార్ సైకిళ్లను అదుపులోకి తీసుకొని, వాటికి జరిమానాలు విధించి మరియు కౌన్సెలింగ్ నిర్వహించి అనంతరం తిరిగి అప్పగించారు గ్రామాల్లో అక్రమ కార్యకలాపాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణ మరియు ప్రజల భద్రతే లక్ష్యంగా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలియజేయడం జరిగింది...ఈ తనిఖీల్లో ఎస్ఐ తిరుపతి రెడ్డి,పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు సిఆర్పిఎఫ్ బలగాలు పాల్గొనడం జరిగింది.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి