Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

కొమురం బీమ్ ఆశయ సాధనే లక్షంగా పోరాటాలు చేద్దాం.తుడుందెబ్బ నేతల పిలుపు. బయ్యారం మండల కేంద్రం లో ఘనంగా భీం 86వ వర్ధంతి.

Author
Posted By G KALYAN KUMAR
| 02 Nov 2026, 07:55 PM | TELANGANA
కొమురం బీమ్ ఆశయ సాధనే లక్షంగా పోరాటాలు చేద్దాం.తుడుందెబ్బ నేతల పిలుపు. బయ్యారం మండల కేంద్రం లో ఘనంగా భీం 86వ వర్ధంతి.

నవంబర్ 02/11/2026.
బయ్యారం మండల కేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీల ఆశా జ్యోతి నిజాం నైజామ్ నవాబుల పై జల్, జంగిల్, జమీన్ ల పై భూమి పుత్రులమైన తమ కే దక్కాలని గెరిల్లా పోరాటం చేసి అడవి జాతి తెగలను విముక్తి చేసిన మహా గోండ్ వీరుడు కొమురం భీం 86వ వర్ధంతిని పురష్కరించు కొని, జాతీయ అధ్యక్షులు గోగ్గల కోటయ్య,రాష్ట్ర అధ్యక్షులు ఈసం నరసింహారావు,రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఆగబోయిన రవి,కొమురం భీమ్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ కొమురం బీమ్ పోరాటాల ఫలితంగానే ఆదివాసులకు ప్రత్యేక భూభాగం, భారత రాజ్యాంగం లోని 5వ షెడ్యూల్ లో ఆదివాసులకు అనేక హక్కులు చట్టాలు కల్పించి ఆదివాసుల ఆత్మ రక్షణ కై భూ రక్షణ కోసం 1/70 చట్టం, ఈ ప్రాంతం లోని అన్నీ రకాల స్వయం నిర్ణయాధికారం ఆదివాసులే తమకు తాము గ్రామ సభల ద్వారా ఏర్పర్చుకొనుటుకు గాను పెసా చట్టం, వచ్చిందని కానీ నేడు పాలకులు ఈ చట్టాలను అమలు చేయక పోగా ఇష్టానుసారంగా వలస వాదులకు ఆదివాసుల చట్టాలను అతీక్రమించి చట్ట విరుద్దంగా అన్ని రకాల సదుపాయలను కల్పిస్తున్నారని, ఆదివాసీ ల అదీనం లో ఉండబడిన వేలాది ఎకరాల భూమి గిర్జనేతరుల అదీనం లో ఉన్నా చట్టాలను అమలు చేసి ఆదివాసీలకు ఇప్పించాల్సింది పోయి అవి ఏవి పట్టించుకోవడం లేదని,ఏజెన్సీ ఏరియాలో అక్రమ కట్టడాలు బహుళ అంతస్థులు, భారీ రైస్ మిల్లు లు, పంక్షన్ హల్స్,పెట్రోల్ బంక్ లు అక్రమంగా నిర్మాణాలు జరిగి చట్టాలు ఉల్లంగణకు గురౌతున్నయని,రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆదివాసి సంఘాలు ఆపోతున్నాయి.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి