కొమురం బీమ్ ఆశయ సాధనే లక్షంగా పోరాటాలు చేద్దాం.తుడుందెబ్బ నేతల పిలుపు. బయ్యారం మండల కేంద్రం లో ఘనంగా భీం 86వ వర్ధంతి.

నవంబర్ 02/11/2026. బయ్యారం మండల కేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీల ఆశా జ్యోతి నిజాం నైజామ్ నవాబుల పై జల్, జంగిల్, జమీన్ ల పై భూమి పుత్రులమైన తమ కే దక్కాలని గెరిల్లా పోరాటం చేసి అడవి జాతి తెగలను విముక్తి చేసిన మహా గోండ్ వీరుడు కొమురం భీం 86వ వర్ధంతిని పురష్కరించు కొని, జాతీయ అధ్యక్షులు గోగ్గల కోటయ్య,రాష్ట్ర అధ్యక్షులు ఈసం నరసింహారావు,రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఆగబోయిన రవి,కొమురం భీమ్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ కొమురం బీమ్ పోరాటాల ఫలితంగానే ఆదివాసులకు ప్రత్యేక భూభాగం,...