Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

పట్టభద్రుల ఓటు హక్కు నమోదు ప్రజాస్వామ్య బలోపేతానికి తొలి అడుగు - తాళ్ళపల్లి కృష్ణా గౌడ్

Author
Posted By G KALYAN KUMAR
| 01 Nov 2026, 09:06 AM | TELANGANA
పట్టభద్రుల ఓటు హక్కు నమోదు ప్రజాస్వామ్య బలోపేతానికి తొలి అడుగు - తాళ్ళపల్లి కృష్ణా గౌడ్

గార్ల, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరుతూ ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకన్న పిలుపు మేరకు, పీఏసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గా ప్రసాద్ సూచన మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పట్టభద్రుల ఓటరు నమోదు ప్రాధాన్యతను వివరిస్తూ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే దిశగా చైతన్యం కల్పించారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో పట్టభద్రుల పాత్ర కీలకమని, విద్యావంతులు తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో వ్యక్తం చేయడం ద్వారా సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం పట్టభద్రుల నుంచి సేకరించిన ఓటరు నమోదు దరఖాస్తులను సంబంధిత రెవెన్యూ డిప్యూటీ తహసిల్దార్ కి సమర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ, పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగం, విద్యారంగ అభివృద్ధి, యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు శాసనమండలిలో ప్రాధాన్యత పొందాలంటే పట్టభద్రులంతా ఓటరు నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని పేర్కొన్నారు.
అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.
ఓటు హక్కు కేవలం హక్కు మాత్రమే కాదు.ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే శక్తివంతమైన ఆయుధం.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకురాలు శంషాద్ బేగం,జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు షేక్ యాకుబ్ పాషా, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు బాబూలాల్, పట్టభద్రుల మండల సమన్వయకర్త ఏసుమల్ల రాజశేఖర్,నాయకులు సర్వేశ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి