పట్టభద్రుల ఓటు హక్కు నమోదు ప్రజాస్వామ్య బలోపేతానికి తొలి అడుగు - తాళ్ళపల్లి కృష్ణా గౌడ్

గార్ల, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరుతూ ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకన్న పిలుపు మేరకు, పీఏసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గా ప్రసాద్ సూచన మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టభద్రుల ఓటరు నమోదు ప్రాధాన్యతను వివరిస్తూ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే దిశగా చైతన్యం కల్పించారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో పట్టభద్రుల పాత్ర కీలకమని, విద్యావంతులు తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో వ్యక్తం చేయడం ద్వారా సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం పట్టభద్రుల నుంచి సేకరించిన ఓటరు నమోదు...