Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే కందాళ

Author
Posted By CK NEWS
| 31 Oct 2026, 04:08 PM | TELANGANA
ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే కందాళ

ముఖ్యమైన పాయింట్స్:

  • ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే కందాళ
  • ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి- కందాల

సికే న్యూస్ ప్రతినిధి
కూసుమంచి మండలం రాజుపేట గ్రామానికి చెందిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తాను చిన్ననాడు విద్యనభ్యసించిన స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పాఠశాల ఆవరణలో కొంతసేపు గడిపారు. విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించి, వారి చదువులు, విద్యా ప్రగతి గురించి తెలుసుకున్నారు. చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేసి వారిని ఆనందపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామంలోని ప్రతి గడపకూ వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్యా సౌకర్యాలు, నాణ్యమైన విద్య గురించి అవగాహన కల్పించాలని సూచించారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించి, ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని గ్రామస్తులను కోరారు. తాను చదువుకున్న పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ఆత్మీయంగా గడపడం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాజుపేట గ్రామ సర్పంచ్ బానోత్ మహేష్, ఉప సర్పంచ్ సోలిపురం ప్రభాకర్ రెడ్డి, కల్లూరు గూడెం సొసైటీ చైర్మన్ వాసంశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపిటిసి మోదుగు వీరభద్రం, ఇటురి శేఖర్, వేముల వీరయ్య, జర్పుల బాలాజీ నాయక్, వెంకన్న. తదితరులు పాల్గొన్నారు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి