ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే కందాళ
ముఖ్యమైన పాయింట్స్:ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే కందాళప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి- కందాల సికే న్యూస్ ప్రతినిధి కూసుమంచి మండలం రాజుపేట గ్రామానికి చెందిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తాను చిన్ననాడు విద్యనభ్యసించిన స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పాఠశాల ఆవరణలో కొంతసేపు గడిపారు. విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించి, వారి చదువులు, విద్యా ప్రగతి గురించి తెలుసుకున్నారు. చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేసి వారిని ఆనందపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి...