Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

కృష్ణా నది ముంపు భూముల వేలంపై సమగ్ర విచారణ చేపట్టాలి

Author
Posted By Charakonda Babu
| 29 Oct 2026, 08:21 PM | వార్తలు
కృష్ణా నది ముంపు భూముల వేలంపై సమగ్ర విచారణ చేపట్టాలి

ముఖ్యమైన పాయింట్స్:

  • శ్రీశైల నీటి మునుక లోతట్టు ప్రాంతం భూములు లక్షలలో వేలం కోట్లలో లాభాలు

సీకే న్యూస్ కొల్లాపూర్ ప్రతినిధి
చిన్నంబావి మండల పరిధిలోని కృష్ణా నది పరివాహక ప్రాంతంలో శ్రీశైలం ప్రాజెక్టు ముంపు భూముల వినియోగంపై వివాదం నెలకొంటోంది. గత కొన్ని సంవత్సరాలుగా కృష్ణానది నీళ్లు ఎండిపోయిన తర్వాత అక్కడ మొలిచే గడ్డికి గ్రామాల్లో ఉన్న గోర్లు పశువులు అక్కడికి వెళ్లి మేత (గడ్డి)ని మేతగా మేపుకోవడానిక ఆధారపడి ప్రాంతాలకు వచ్చి గడ్డి మేపుకొని గొర్రెలను, మేకలను, పశువులను, జీవనోపాధి కొనసాగించే వారు గొల్ల కురుమలు. అలాంటి జీవనోపాధిపై పుట్టకొడుతూ కొంత మంది గ్రామ పెద్దలమని చెప్పుకుంటూ అనధికారికంగా ఆ కృష్ణా నది లోతట్టు పరివాహక ప్రాంతాలను వేలం వేస్తూ డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. ఈ గ్రామ పెద్దలు లీడర్ల ముసుగులో గ్రామాభివృద్ధి పేరుతో కొన్ని గ్రామాల్లో రైతు కమిటీలు అని చెప్పుకుంటూ ఈ భూములను అనధికారికంగా వేలం వేస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో భూమి లేని నిరుపేద కుటుంబాలకు సాగు చేసుకునే అవకాశం దూరమవుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

కరువు కోరల్లో పేదలు సాగుకు దూరమవుతున్న నిరుపేద కుటుంబాలు!

ప్రస్తుతం కరువు ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం సంక్షోభంలో పడింది. మరోవైపు భూమిలేని పేద కుటుంబాలు ఉపాధి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని ముంపు భూములు పేదలకు జీవనాధారంగా మారాల్సి ఉండగా, వేలం ద్వారా సాగు హక్కులు పొందే పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గొర్రెలు మేకలు, పశువులకు మేత గడ్డి ఎక్కడ

ఎలినో ప్రభావంతో వర్షాలు లేక జంతువులకు ఆహారం దొరకక నానా అవస్థలు పడుతున్నారు. కృష్ణానది నీరు ఎండిపోయిన తర్వాత కృష్ణానది పరివాహ ప్రాంతాలకు సంబంధించిన గొర్రెలు, పశువులు మేకలు కృష్ణానది లోతట్టు ప్రాంతంలో మొలిచే గడ్డి పై ఆధారపడి గొల్ల కురుమలు జీవనోపాధి పొందేవారు. అలాంటి వాటిపై అనాధికారికంగా కృష్ణ నది లోతట్టు ప్రాంతాన్ని రైతు కమిటీల పేరుతో రాజకీయ నాయకుల ముసుగులో గ్రామ అభివృద్ధి పేరుతో అక్రమ వేలం వేస్తూ లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

వేలంలో అధిక మొత్తాలు చెల్లించగలిగిన వారికే భూములు దక్కితే,

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు సాగుకు దూరమయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. గ్రామాభివృద్ధి పేరుతో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిధులకు సంబంధించి పారదర్శకత పాటిస్తున్నారా ఆ మొత్తాలను ఏ పనులకు ఖర్చు చేస్తున్నారు, అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ముంపు భూములపై అధికారం ఎవరిది

శ్రీశైలం ప్రాజెక్టు ముంపు భూములను వేలం వేసే అధికారం ఆయా కమిటీలకు ఉందా, భూముల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలు ఏమిటి, వేలం ద్వారా వసూలు చేస్తున్న మొత్తాలకు అధికారిక అనుమతులు ఉన్నాయా, అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సంబంధిత రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, భూముల స్వరూపం, యాజమాన్య హక్కులు, ప్రస్తుత వినియోగం, వేలం నిర్వహణకు సంబంధించిన వివరాలను పరిశీలన చేయల్సిన అవసరం ఉంది.

నిరుపేదలకు న్యాయం చేయాలి.. అధికారుల విచారణ తప్పనిసరి!

ముంపు భూముల వినియోగంలో అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, గ్రామాభివృద్ధి పేరుతో వసూలు చేసిన నిధులపై లెక్కలు వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు. భూమి లేని నిరుపేద కుటుంబాలకు సాగు అవకాశాలు కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కరువు సమయంలో పేదలకు అండగా నిలవాల్సిన వ్యవస్థలు వారిని సాగుకు దూరం చేస్తున్నాయనే ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలి. ముంపు భూముల వేలం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలి. నిరు పేదలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలి.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి