Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ఉద్యమకారుల అరెస్టులు ప్రజాస్వామ్యానికి మచ్చ

Author
Posted By CK NEWS
| 26 Oct 2026, 06:29 PM | TELANGANA
ఉద్యమకారుల అరెస్టులు ప్రజాస్వామ్యానికి మచ్చ

ముఖ్యమైన పాయింట్స్:

  • ఉద్యమకారుల అరెస్టులు ప్రజాస్వామ్యానికి మచ్చ
  • హామీలు నెరవేర్చకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తాం* : డా. కె.వి. కృష్ణారావు
  • సి కె న్యూస్ ప్రతినిది ఖమ్మం

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడని ఉద్యమకారులను హౌస్ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి డా. కె.వి. కృష్ణారావు పేర్కొన్నారు . ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులతో భయభ్రాంతులకు గురిచేయడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని అన్నారు . ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై ఈ నెల 26వ తేదీలోపు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ డిమాండ్ పిలుపు మేరకు సీఎం ఇంటి ముట్టడి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మొత్తం మీద ఉద్యమకారులను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు , అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు . తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను తక్షణమే వేగవంతం చేసి , పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు . ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు , ధర్నాలు , ఆందోళనలు చేపట్టి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో పగడాల నరేందర్ , లింగానబోయిన సతీష్ , డో కుపర్తి సుబ్బారావు , రెడ్డబోయిన వరలక్ష్మి , కామని అనంత లక్మి , స్వరూప రెడ్డి , కమలమ్మ , ధన లక్మీ , యాక లక్ష్మీ తదితరులు ఉన్నారు .

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి