Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

నందారం నరసింహ గౌడ్ నివాసంలో ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు

Author
Posted By P. Shekar
| 25 Oct 2026, 05:36 PM | TELANGANA
నందారం నరసింహ గౌడ్ నివాసంలో ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు

అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ నివాసంలో ఆదివారం ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు కార్యక్రమం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నందారం నరసింహ గౌడ్ ప్రముఖులకు సాదర స్వాగతం పలికి, శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం నేతలందరూ కలిసి మధ్యాహ్న విందులో పాల్గొని ఆత్మీయంగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, నందారం నరసింహ గౌడ్ నివాసానికి రావాలని చాలాకాలంగా అనుకుంటున్నానని, వివిధ కార్యక్రమాల కారణంగా ఇంతకాలం కుదరలేదని తెలిపారు. ఈరోజు సమయం కుదరడంతో ఇక్కడికి వచ్చి అందరితో కలిసి భోజనం చేయడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు అండగా నిలవాలని సూచించారు.
విందు సందర్భంగా స్థానిక అభివృద్ధి అంశాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై నాయకుల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ ఆత్మీయ సమావేశం నాయకులు, కార్యకర్తల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగింది.
ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదర్శ్ రెడ్డి, అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ కౌన్సిలర్లు, పలువురు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నందారం నరసింహ గౌడ్ నివాసంలో ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి