నందారం నరసింహ గౌడ్ నివాసంలో ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు

అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ నివాసంలో ఆదివారం ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు కార్యక్రమం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నందారం నరసింహ గౌడ్ ప్రముఖులకు సాదర స్వాగతం పలికి, శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం నేతలందరూ కలిసి మధ్యాహ్న విందులో పాల్గొని ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, నందారం నరసింహ గౌడ్ నివాసానికి రావాలని చాలాకాలంగా అనుకుంటున్నానని,...