Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Author
Posted By P. Shekar
| 25 Oct 2026, 04:42 PM | TELANGANA
రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జీహెచ్‌ఎంసీ కార్మికుడితో పాటు ఆటో ట్రాలీ డ్రైవర్ మృతి చెందినట్లు కొల్లూరు పోలీసులు ప్రాథమిక సమాచారం తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. రింగ్ రోడ్డుపై డివైడర్‌లో ఉన్న చెట్లకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది వాటర్ ట్యాంకర్ ద్వారా నీరు పోస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి ముత్తంగి వైపు వెళ్తున్న ఆటో ట్రాలీ వేగంగా వచ్చి నీరు పోస్తున్న కార్మికుడు శ్రీనివాస్ అలియాస్ వీరు (30)ను ఢీకొట్టినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో కార్మికుడు శ్రీనివాస్ అలియాస్ వీరుతో పాటు ఆటో నడుపుతున్న శ్రీనాథ్ (26) తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలిసింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి